వయసులో చిన్న.. మేధస్సులో మిన్న


ఎనిమిది గంటల సాధన..
మియాపూర్‌ అపర్ణకౌంటిలో నివాసం ఉండే సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గోగినేని వేణుగోపాల్‌, రాధిక దంపతుల కుమారుడు అవినాష్‌సాయి. నగరంలోని ఓక్రిడ్జి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. మెమొరీ ట్రైనింగ్‌పై ఆసక్తి ఉన్న అవినాష్‌ ప్రపంచస్థాయిలో జరిగే పోటీలకు హాజరయ్యేందుకు తగిన విధంగా సుమారు నెలరోజులుగా ప్రతిరోజు 8 గంటల పాటు సాధన చేశాడు. మెమొరీ ట్రైనింగ్‌ శిక్షకులు జయసింహ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ తీసుకుని నగరంలో నిర్వహించిన నేషనల్‌ మెమెరీ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అండర్‌-12 కిడ్స్‌ కేటగీరిలో మొదటి స్థానం సాధించాడు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ రెండో వారంలో చైనాలోని షెంజైన్‌లో నిర్వహించిన 26వ వరల్డ్‌ మెమొరీ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యాడు. మొత్తం 17 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో ఇండియాకు నాలుగోస్థానం దక్కగా భారతదేశం నుంచి హాజరైన 17 మందిలో అవినాష్‌ మూడో స్థానంలో నిలిచాడు.

చదువులోనూ ముందంజ..
జాతీయ స్థాయి మెమొరీ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటుతున్న అవినాష్‌ చదువులోనూ ముందజలో ఉన్నాడు. ఓ వైపు శిక్షణ తీసుకుంటూనే మరోవైపు ఓక్రిడ్జి ఇంటర్నేషనల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ అర్జున్‌రావు, వైస్‌ప్రిన్సిపాల్‌ చెన్నుపాటి హేమ, పాఠశాల యాజమాన్యం సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు, క్రీడల్లో సత్తా చాటుతున్నాడు. బాస్కెట్‌బాల్‌లో రాణిస్తున్నాడు. 2016లో బెంగళూరులో నిర్వహించిన మోడల్‌ యూనైటెడ్‌ నేషనల్‌ కార్యక్రమంలో పాల్గొని బెస్ట్‌ డెలిగెట్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా పాఠశాల తరుఫున వివిధ ప్రాంతాల్లో జరిగిన స్పెల్‌ బీ పోటీల్లోనూ పలు బహుమతులు అందుకున్నాడు.

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధిస్తా: అవినాష్‌సాయి

భారతదేశం తరఫున 2018 డిసెంబర్‌లో జరిగే ప్రపంచ మెమొరీ ఛాంపియన్‌షిప్‌కు హాజరవుతాను. అదేవిధంగా ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించాలనేది నా ప్రధాన లక్ష్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాటు శిక్షులు జైసింహ అందించిన శిక్షణ, సహకారంతోనే నేను ఈ స్థాయిలో రాణించగలుగుతున్నాను.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com