డ్వేన్‌ జాన్సన్‌ను ఆశ్చర్యపరిచిన హెలికాఫ్టర్‌ షాట్‌


‘ది రాక్‌’.. హాలీవుడ్‌ స్టార్‌ డ్వేన్‌ జాన్సన్‌కు భారత్‌లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. డిసెంబర్‌ 29న ఆయన నటించిన ‘జుమాంజి: వెల్‌కం టు ది జంగిల్‌’ ఇక్కడ విడుదల అవుతోంది. ఈ సందర్భంగా భారతీయ అభిమానులకు ఇష్టమైన క్రికెట్‌ గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సరదాగా జవాబులు ఇచ్చాడు. కొన్ని ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు, హావభావాలు ఫన్నీగా అనిపించాయి.
అంపైర్‌ ఔట్‌ సిగ్నల్‌ ఏంటని అడిగినప్పుడు జాన్సన్‌ దాన్ని ‘నువ్వు నంబర్‌ వన్‌’ అంటూ చెప్పాడు. ఆ తర్వాత సరైన సమాధానం చెప్పి ‘కాస్త నన్ను భరించండి’ అని అభిమానులకు సూచించాడు. బాక్స్‌లో ఉన్న థర్డ్‌ అంపైర్‌ను చూసి ఆయన్ను అలా బాక్స్‌లో బంధించడం బాలేదన్నాడు. ఆయన అందాన్ని కాస్త బయట ప్రదర్శిస్తే బాగుంటుందన్నాడు. నోబాల్‌ చూపినప్పుడు ..‘హే రాక్‌ లక్షల కొద్దీ జాన్సన్‌ భారతీయ అభిమానులు అలాగే ఉంటారు’ అని కామెంట్‌ చేశాడు.

ధోనీ హెలికాప్టర్‌ షాట్‌ గురించి జాన్సన్‌ను ప్రశ్నించారు. క్లిప్‌ చూసిన తర్వాత దాన్ని హెలికాఫ్టర్‌ షాట్‌ అంటారు అని సరిగ్గా చెప్పాడు. మరో ప్రశ్నకు ర్యాంప్‌ షాట్‌ అని సరైన సమాధానం చెప్పాడు. ఆ తర్వాత క్రికెట్‌ అంటే తనకు అభిమానమని, రాబోయే సిరీసుల్లో భారత జట్టు బాగా ఆడాలని కోరుకున్నాడు. అభిమానులను అలరించాలని ఆశించాడు. శ్రీలంకతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఈ వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రసారం చేసింది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com