హాలీవుడ్‌ పాత్రలకు తెల్లరంగు


ఈమధ్యనే అనేక లైంగికవేధింపుల విషయాలు బయటకు వచ్చి హాలీవుడ్‌ అంతా నానా విధాలుగా నలుగురి నోళ్లలోనా నానింది. అది చాలదన్నట్లు ఇప్పుడు మరో కొత్త అంశం హాలీవుడ్‌ను వేధిస్తోంది. ఆసియన్‌ ఖండాలను హాలీవుడ్‌, భౌతికంగా కాకుండా మరోవిధంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందనేది ఈ ఆరోపణ. ఆసియన్‌ ఖండంలోని చాలా దేశాలకు చెందిన పుస్తకాలు, కథలు వగైరాల వాటిని ఆధారం చేసుకుని, హాలీవుడ్‌ వారు సినిమాలు తీస్తున్నప్పుడు, ఆసియన్‌ పాత్రలకు ‘శ్వేతవర్ణం’ పూసేసి, అవి తమ తెల్ల జాతికి సంబంధించినవేనన్న భావన కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఆరోపణ. ‘హెల్‌బాయ్‌’ అనే ఓ కొత్త చిత్రంలో ఓ పాత్రకు ఎడ్‌ స్క్రీన్‌ అనే తెల్లనటుడిని ఎంచుకున్నారు, కానీ, ఆయన ధరించాల్సిన పాత్ర ఒక ఆసియన్‌ ఖండ దేశానికి చెందినదనీ, ఆ పాత్రకు తెల్లవారిని ఎంచుకోవటం ఏమిటనీ, ఇది ‘ఒక రకమైన సాంస్కృతిక దురాక్రమణ’ అని విమర్శలు వెల్లువెత్తాయి. దెబ్బతో, ఆయన తన పాత్ర నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ పాత్రకు ఇప్పుడు డేనియల్‌ డే కిమ్‌ అనే ఆసియన్‌ నటుడిని ఎంచుకున్నారు. ఇలాంటి ఆరోపణలే స్కార్లెట్‌ జొహాన్‌సన్‌పైనా వచ్చాయి. ఆమె ‘ఘోస్ట్‌ ఇన్‌ ది షెల్‌’ అనే చిత్రంలో ‘మిరా’ అనే పాత్రలో నటించారు. అసలు ఆ పాత్ర జపనీస్‌ దేశానికి చెందిన ‘మొటాకో కుసాంగి’ కాగా, ఆ పాత్రకు ‘తెల్లరంగు’ వేస్తూ ఆ పాత్రను ‘మిరా’ చేశారని ఎందరో దుమ్మెత్తి పోశారు. ఈ వివాదం ఇంకా రాజుకునే సూచనలే కానవస్తున్నాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com