యాప్‌స్టోర్‌లో రికార్డు స్థాయి కొనుగోళ్లు


నూతన సంవత్సరం తొలి రోజున యాపిల్‌ సంస్థ వినియోగదారులు రికార్డు స్థాయిలో యాప్స్‌, గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేశారు. జనవరి 1న యాప్‌‌స్టోర్‌లో దాదాపు 300 మిలియన్‌ డాలర్ల కొనుగోళ్లు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. యాప్‌స్టోర్‌ 2008 జులైలో ప్రారంభించగా ఇంతటి కొనుగోళ్లు జరగడం ఇదే తొలిసారి అని తెలిపింది. క్రిస్మస్‌ రోజు నుంచి నూతన సంవత్సరం రోజు వరకు వినియోగదారులు యాప్స్‌, గేమ్స్‌ డౌన్‌లోడ్‌ కోసం 890 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు యాపిల్‌ తెలిపింది.

యాప్‌స్టోర్‌కు వచ్చిన స్పందన పట్ల ఆశ్చర్యపోయామని, చాలా మంది వినియోగదారులు కొత్త యాప్స్‌, గేమ్స్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని యాపిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ వరల్డ్‌వైడ్‌ మార్కెటింగ్‌ ఫిల్‌ షిల్లర్‌ వెల్లడించారు. 2016తో పోలిస్తే 2017లో ఐఓఎస్‌ డెవెలపర్స్‌ 30శాతం ఎక్కువగా సంపాదించారని, గతేడాది ఐఓఎస్‌ డెవెలపర్స్‌ ఆదాయం 26.5 బిలియన్‌ డాలర్లు అని తెలిపారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com