ప్రదీప్‌పై పోస్ట్‌కు పోలీసుల స్పందన


పోస్ట్‌: ‘సార్‌.. మా ప్రదీప్‌ను ఒగ్గేయ్యండి.. పాపం చిన్నపిల్లాడు.. తెలియకచేశాడు’
ట్రాఫిక్‌ పోలీసులు: ‘చిన్న పిల్లాడైతే పాలుతాగాలి కానీ.. మందుతాగి నడపడం కరెక్ట్‌ కాదు..’’
టీవీ వ్యాఖ్యాత ప్రదీప్‌ను వదిలేయాలంటూ ఫేస్‌బుక్‌లో ఉంచిన వ్యాఖ్యకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు శుక్రవారం ఇచ్చిన సూటి సమాదానం ఇది. డిసెంబరు 31 అర్ధరాత్రి మోతాదుకు మించి మద్యం తాగి పోలీసులకు దొరికిపోయిన టీవీ వ్యాఖ్యాత ప్రదీప్‌ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో పొగడ్తలు.. తెగడ్తలు వస్తున్నాయి. నీతులు చెప్పిన ప్రదీప్‌.. మద్యం తాగి కారు నడుపుతూ అడ్డంగా దొరికిపోయాడంటూ నెటిజన్లు ఐదురోజుల నుంచి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా హనీ భవాని పేరుతో ట్రాఫిక్‌ పోలీస్‌ ఫేస్‌బుక్‌లో ప్రదీప్‌ను వదిలేయండంటూ ఉంచిన పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ సృష్టిస్తోంది. పై చిత్రంలో ఉన్నది ఇదే..

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com