సచిన్ కుమార్తెకు బెదిరింపులు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయురాలు సారాను ఫోన్లో వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన 32 ఏళ్ల దేవ్ మిధి సచిన్ ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్‌కు 20 సార్లు కాల్ చేశాడు. సారాతో అతను అసభ్యంగా మాట్లాడాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. సారాను కిడ్నాప్ చేస్తానని కూడా దేవ్ బెదిరించాడు. దీంతో ఆమె ముంబయిలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్‌ను ఛేదించడం ద్వారా సారాతో అసభ్యంగా మాట్లాడింది దేవ్ అని, అతడిది పశ్చిమ బెంగాల్ అని తెలుసుకున్నారు. పోలీసులు అతడిని ముంబయికి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. దేవ్‌కు మతిస్థిమితం లేదని అతడి కుటుంబ సభ్యులు అంటుండగా.. ఈ విషయాన్ని నిర్ధరించేందుకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు