రాగి మెరవక పోవచ్చు!


బంగారం, వెండి
బంగారం ఫిబ్రవరి కాంట్రాక్టు సోమవారం రూ.29,160 వద్ద ప్రారంభమైంది. రూ.29,061 వద్ద కనిష్ఠ స్థాయికి చేరిన తర్వాత సానుకూల కొనుగోళ్లు కనిపించాయి. 0.18 శాతం లాభంతో రూ.29,212 వద్ద ముగిసింది. వరుసగా మూడో వారామూ లాభాలనే పొందింది. ఈవారంలో రూ.29,408 నుంచి స్వల్పకాలిక ట్రేడర్లు లాభాలు స్వీకరించడం మంచిది. రూ.29,772 వద్ద నిరోధం ఎదురవుతుందని అంచనా. ఆ స్థాయి పైన కొనసాగితే మినహా స్థిరీకరణకే అవకాశాలున్నాయి. మధ్య నుంచి దీర్ఘకాల ట్రేడర్లు రూ.29,025 స్థాయి వరకు తగ్గినపుడుల్లా కొనుగోలు చేయవచ్చు. వెండి మార్చి కాంట్రాక్టు రూ.39,089 వద్ద మొదలైంది. ఊగిసలాడినప్పటికీ వరుసగా నాలుగో వారమూ ర్యాలీ కొనసాగించింది. గురువారం రూ.38,900 కనిష్ఠ స్థాయికి చేరిన తర్వాత జోరు పెరిగింది. రూ.39,372 వద్ద గరిష్ఠ స్థాయిని చేరి.. చివరకు 0.40% లాభంతో రూ.39,246 వద్ద ముగిసింది. సాంకేతికంగా చూస్తే సోమవారం రూ.39,445 స్థాయి పైన ట్రేడయితే మాత్రం రూ.39,644 వరకూ ఆ తర్వాత రూ.40,060 వరకు ర్యాలీ కొనసాగొచ్చు. రూ.39,545 తరవాత స్వల్పకాల ట్రేడర్లు లాభాలు స్వీకరించడం మంచి వ్యూహమవుతుంది. మధ్య నుంచి దీర్ఘకాల ట్రేడర్లు మాత్రం రూ.38,220 కిందకు వస్తే మినహా మరికొన్ని లాట్లను జతచేసుకోవచ్చు.
ప్రాథమిక లోహాలు
రాగి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈ వారం కూడా ఒత్తిడి ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇప్పటికే ఉన్న షార్ట్‌ సెల్‌ పొజిషన్లను రూ.445 స్థాయి వరకు అట్టేపెట్టి ఉంచుకోవడం మంచి వ్యూహమే అవుతుంది. కాపర్‌ కాంట్రాక్టు పైకి వెళితే తాజాగా షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.445 లక్ష్యంతో రూ.459 దరిదాపుల్లో విక్రయించడం మేలు. సీసం జనవరి ఫ్యూచర్‌ కాంట్రాక్టు ఈ వారం రూ.158 దిగువకు(ముగింపు పద్ధతిన) వస్తే మినహా రూ.164 వరకు ఆ తరవాత రూ.167 వరకు పరుగులు తీయొచ్చు. జింక్‌ జనవరి ఫ్యూచర్‌ కాంట్రాక్ట్‌ రూ.210 కిందకు దిగితే మినహా రూ.216 వరకు వెళ్లడానికి అవకాశాలున్నాయి. రూ.206 లక్ష్యంతో రూ.216 పైన షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. మూడు వారాల తరవాత అల్యూమినియం ఫ్యూచర్‌ కాంట్రాక్టు నష్టపోయింది. ఇంకా నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ వారం కూడా పెరిగినపుడల్లా విక్రయించడం మేలు. నికెల్‌ జనవరి కాంట్రాక్టు సాంకేతికంగా చూస్తే విక్రయించిన జోన్‌లో కనిపిస్తోంది. కాబట్టి రూ.820ను స్టాప్‌ అవుట్‌గా పెట్టుకుని రూ.766 ఆ తర్వాత రూ.745 లక్ష్యంతో విక్రయించడం మంచి వ్యూహం.
ఇంధన రంగం
ముడి చమురు జనవరి కాంట్రాక్టు అధికంగా కొనుగోలు జరిగినట్లుగా కనిపిస్తున్నా.. ఇంకా అవకాశం ఉంది. రూ.3798 దిగువకు చేరితే మినహా.. మరింత పెరగడానికే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్‌ పొజిషన్లను రూ.3998 వరకు అట్టేపెట్టి ఉంచుకోవచ్చు. అయితే తాజా కొనుగోళ్లు మాత్రం వద్దు. తక్కువ నష్టభయం కోరుకునే ట్రేడర్లు వచ్చే రెండు వారాల పాటు ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే మేలు. రూ.166 స్థాయి దిగువకు చేరితే మరింత బలహీనతలు కనిపించవచ్చు. కాబట్టి ఆ స్థాయిపై ఓ కన్నేయడం మంచిది. ముడి పామాయిల్‌ జనవరి ఫ్యూచర్‌ కాంట్రాక్టు ఈ వారం రూ.558 దిగువకు చేరితే మరింత తగ్గవచ్చు. ఆ స్థాయి దిగువన మాత్రామే తాజా విక్రయాలు చేయొచ్చని భావిస్తున్నాం.
వ్యవసాయ ఉత్పత్తులు
ధనియా జనవరి కాంట్రాక్టు గత రెండు వారాలుగా నష్టాలతోనే ముగిసింది. రూ.5149 స్థాయి వరకు ఇది నష్టపోవచ్చు. ఆ స్థాయి వద్ద లాభాల స్వీకరణ మేలు. జీలకర్ర జనవరి కాంట్రాక్టును చూస్తే ఇప్పటికే ఎక్కువ విక్రయాలైనట్లుగా కనిపిస్తోంది. సాంకేతికంగా చూస్తే మరింత దిద్దుబాటుకు అవకాశం ఉంది. పెరిగినపుడల్లా విక్రయించడం ఈ వారం మంచి వ్యూహమవుతుంది. పొజిషన్లు ఉన్న వారు రూ.20,360 వరకు తమ షార్ట్‌ పొజిషన్లను అట్టే పెట్టిఉంచుకోవచ్చు. ఈ వారం సోయాబీన్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టుకు రూ.3426 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. కాబట్టి ఆ స్థాయి పైన ట్రేడయితే తప్ప రూ.3226 దిగువన విక్రయించడమే మేలు.
- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com