సూర్య సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు


‘ఇరువురి భామల కౌగిలిలో’.. అంటూ తన తదుపరి చిత్రంలో డ్యూయెట్లు పాడనున్నారు నటుడు సూర్య. ఆయన విఘ్నేశ్‌ దర్శకత్వంలో నటించిన ‘తానా సేంద కూట్టం’ సంక్రాంతి కానుకగా ఈనెల 12వ తేదీన తెరపైకి రానున్న విషయం తెలిసిందే. తర్వాత ఆయన సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో సూర్యకు జోడీగా పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. చివరకు సాయిపల్లవిని ఎంచుకున్నట్లు చిత్రవర్గాలు ఇటీవల ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మరో కథానాయికగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా సూర్యతో ఆడిపాడనున్నట్లు సమాచారం. ఇటీవలే సూర్య తమ్ముడు కార్తితో ‘ధీరన్‌ అధిగారం ఒండ్రు’లో రకుల్‌ప్రీత్‌సింగ్‌ జోడీ కట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అన్నతో కూడా జతకట్టనుంది రకుల్‌. సెల్వరాఘవన్‌ వంటి వారి దర్శకత్వంలో నటించాలన్నది సూర్యకున్న మహిళా ఫ్యాన్స్‌ కోరిక. ఇప్పుడు అది నెరవేరడంతో వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారని సమాచారం. ఇందులో ఇద్దరు కథానాయికలను ఎంచుకోవడంతో ముక్కోణపు ప్రేమ కథగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com