మరో అరుదైన కలయిక


చిత్ర పరిశ్రమలో కథకు తగ్గట్టు తమ శరీరాకృతిని మార్చుకుని నటించే వారు కమల్‌హాసన్‌, విక్రంలు. అంకితభావం, వైవిధ్య నటనతో వీరు వినోదాన్ని అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘అపూర్వ సహోదరర్గల్‌’, ‘ఇందియన్‌’, ‘దశావతారం’ వంటి సినిమాలతో కమల్‌హాసన్‌ ఇలాంటి కథల విషయంలో తానేంటో నిరూపించుకున్నారు. ‘సేతు’, ‘పితామగన్‌’, ‘కాశి’, ‘అన్నియన్‌’ వంటి చిత్రాలతో విక్రం కూడా వైవిధ్యాన్ని చాటుకున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు కలిసి నటించలేదు. ఆ మధ్య వార్తలు వినిపించినా సినిమా పట్టాలెక్కలేదు. తాజాగా కమల్‌హాసన్‌ నిర్మాణంలోని సినిమాలో విక్రం నటించనున్నట్లు కోడంబాక్కం వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ బ్యానరులోని ఈ సినిమాకు రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వం వహించనున్నారు. ఆయన కమల్‌హాసన్‌ హీరోగా ‘తూంగావనం’ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com