హైదరాబాద్‌లో నేను నేర్చుకుంది అదే: రాజ్‌తరుణ్‌


ఆరడుగుల పొడవు, సిక్స్‌ప్యాక్‌ ఉంటేనే హీరో అవుతారా? అల్లరితనం, ఎనర్జీ, బుల్లెట్లు మాదిరి దూసుకొచ్చే డైలాగులు చెప్పినా హీరోగా మంచి పేరొస్తుంది అని నిరూపించారు రాజ్‌తరుణ్‌. తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన రాజ్‌తరుణ్‌ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వరుసగా ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్‌’, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, ‘ఈడో రకం ఆడో రకం’ తదితర సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటించిన ‘రంగుల రాట్నం’ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్‌ ట్విటర్‌లో అభిమానులతో చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న ఆసక్తికరమైన విషయాలివీ..

ప్రశ్న: ‘కుమారి 21 ఎఫ్’లాంటి మరో సినిమా చేయాలన్నా

రాజ్ తరుణ్‌‌: తప్పకుండా

తరువాతి సినిమాలు ఏంటి?

రంగుల రాట్నం తరువాత రాజుగాడు, లవర్‌ సినిమాలు ఉన్నాయి

తమిళంలో నటిస్తారా?

ఇప్పటికైతే లేదు బ్రో

హైదరాబాద్‌లో మీరు ఏం నేర్చుకున్నారు?

బతకడం

మిమ్మల్ని ఓ మంచి ప్రేమకథా చిత్రంలో చూడాలనుకుంటున్నాం

రంగుల రాట్నం అలాంటి సినిమానే. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

‘అజ్ఞాతవాసి’ కోసం టికెట్లు బుక్‌ చేసుకున్నారా?

ఎప్పుడో..

నాగార్జున గురించి ఒక్కమాటలో..?

మన్మథుడు

మీరు నటించిన సినిమాల్లో ఏది బెస్ట్‌ అనిపించింది?

చెప్పడం కష్టమే

సినిమా రంగంలోకి రాకముందు ఏం చేసేవారు?

షార్ట్‌ ఫిలింస్‌

నాగార్జున గారితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

ఆయనతో పనిచేయడం ఎప్పుడూ ఓ అద్భుతమైన అనుభూతే

తూర్పు గోదావరి వాసుల గురించి ఒక్కమాటలో

కేకెహే..!

దర్శకత్వం చేసే ఆలోచనలు ఉన్నాయా?

తప్పకుండా. ఎప్పుడు చేస్తానో తెలీదు కానీ తప్పకుండా చేస్తా.

మహేశ్‌ బాబు సినిమాల్లో మీకు నచ్చింది?

ఒక్కడు

రవితేజతో మల్టీస్టారర్‌ వస్తే చేస్తారా?

తప్పకుండా

మీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నిజమా?

లేదు

హెబ్బాతో మరో సినిమా కోసం ఎదురుచూస్తున్నాం

ఈ ఏడాదిలో అయితే జరగదు

ఇష్టమైన క్రికెటర్‌?

ఇప్పటికైతే విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య, రోహిత్‌ శర్మ

మీ ఒత్తిడిని దూరం చేసేది?

నా పెంపుడు కుక్కలు. మా ఇంట్లో 15 కుక్కలు ఉన్నాయి. సినిమాలు కూడా ఒత్తిడి తగ్గిస్తాయి.

రంగుల రాట్నం అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు?

కథను దృష్టిలో పెట్టుకుని

ఇష్టమైన నటి

సమంత

మీరు ఎక్కువగా వాడే ఊతపదం?

డార్లింగ్‌

మీ ముద్దుపేరు ఏంటి?

బాబా

రాజేంద్రప్రసాద్‌ గురించి మీ అభిప్రాయం?

గొప్ప నటుడు. గొప్ప స్నేహితుడు. మంచి వ్యక్తి

లవ్‌ చెయ్యాలా వద్దా?

తప్పకుండా చేయాలి

అలనాటి నటీమణులతో నటించే అవకాశం వస్తే ఎవరితో నటిస్తారు?

శోభన

ఏ సినిమా రీమేక్‌లో నటించాలనుకుంటున్నారు?

వేట

పెళ్లెప్పుడు చేసుకుంటారు?

సమయం వచ్చినప్పుడు

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com