బరువు తగ్గడం లేదా


సన్నగా నాజూగ్గా కనిపించాలని ఎవరికి ఉండదు. ఈ ప్రయత్నంలో కొందరు అతిగా వ్యాయామం చేయడానికి ప్రాధాన్యం ఇస్తే... మరికొందరు పూర్తిగా నోరు కట్టేసుకుంటారు. ఈ రెండూ తప్పే. బరువు తగ్గేందుకు ప్రాథమిక సూత్రాల్ని పాటించినప్పుడే లాభాలుంటాయని మరవకూడదు.
* కెలొరీల లెక్క వద్దు: సన్నగా మారాలనే ఆలోచనతో ఏది తిన్నా కెలొరీలు లెక్కేస్తుంటారు చాలామంది. నిజానికి అన్నీ సమపాళ్లల్లో తిన్నప్పుడు అదనపు కెలొరీలు శరీరంలో కొవ్వుగా మారే పరిస్థితి ఉండదు. జీవక్రియల్లో అవన్నీ భాగమై అవయవాలన్నీ చురుగ్గా పనిచేసేందుకు సాయపడతాయి. అంతేకాదు వయసుని బట్టి శరీరానికి కెలొరీల అవసరం తప్పనిసరి. దాన్ని తెలుసుకోగలిగితే బరువుని అదుపులో ఉంచుకోవడం సులువు. రోజూ వీలైనన్ని ఎక్కువ కెలొరీలు ఖర్చు పెట్టగలిగితే చాలు.
* ఒకటే వద్దు: రోజూ ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్తున్నా అనో, మరో వ్యాయామం చేస్తున్నా అనో సరిపెట్టుకోవద్దు. మీ శరీరం వ్యాయామానికి అలవాటు పడటానికి ముందు ఇలాంటివి చేయాలి. తరువాత శరీరం మొత్తం ప్రభావం చూపించే వ్యాయామాలు వారానికి సరిపడా ప్రణాళిక వేసుకుని చేయాలి. తాడాట, సిట్‌-అప్స్‌, డ్యాన్స్‌, యోగా, ఈత...ఇలా అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఉత్సాహంగా ఉండాలంటే కొత్తగా వస్తున్న ఫిట్‌నెస్‌ ట్రెండ్‌లనూ అనుసరించొచ్చు.
* నిద్రపోవాల్సిందే: ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గడంలేదా! అంటే మీరు తగినంతగా నిద్రపోవడంలేదమో గమనించుకోండి. ఎందుకంటే తీసుకున్న ఆహారం, దానికి తగిన వ్యాయామంతో పాటు కంటినిండా నిద్రకూడా అందినప్పుడే శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. మీరూ నాజూగ్గా మారతారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com