ఫిఫా వరల్డ్ కప్ – ఉరుగ్వే దాడికి సౌదీ ఔట్


ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్‌ ఎ మ్యాచ్‌లో ఉరుగ్వే రెండో గెలుపును నమోదు చేసింది. సౌదీ అరేబియాపై 1-0 తేడాతో గెలిచి తన సత్తాను చాటింది. ఉరుగ్వే టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో ఈజిప్టును 1-0తో మట్టి కరిపించింది. ఆట 23వ నిమిషంలో ఉరుగ్వే ఆటగాడు తన దేశం తరపున 100వ గేమ్‌ను అడుతున్న లూయీస్‌ సారేజ్‌ తన సహచరుడు సాంచెజ్‌ అందించిన పాస్‌ను గోల్‌గా చేశాడు. సౌదీ ఆటగాడు అల్‌ ఒవైస్‌ దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికి బ ంతి తుపాకి గుండులా గోల్‌పోస్ట్‌లోకి దూసుకుపోయింది. సౌదీ, ఉరుగ్వేలు తలపడటం ఇది మూడోసారి కాగా ప్రపంచకప్‌ వేదికగా ఇరు జట్లు పోటీ పడటం ఇదే తొలిసారి. ఆట అర్ధ భాగ సమయం గడిచేసరికి ఉరుగ్వే 1-0తో ఆధిక్యంలో ఉంది. అనంతరం ఆటలో ఇరుజట్లు తమ ఆటగాళ్లను సబ్‌స్ట్యూట్‌ చేసుకున్నాయి. ఆట 82వ నిమిషంలో గోల్‌ చేసిన ఉరుగ్వే ఆటగాడు మైదానం వీడడంతో అతని స్థానంలో నహిటన్‌ నాండేజ్‌ వచ్చాడు. ఈ సమయంలో సౌదీ తన దూకుడును పెంచినప్పటికి ఉరుగ్వే ఆటగాళ్ల ముందు పనిచేయలేదు. ఆట 80వ నిమిషం వరకు సౌదీ ఒక్కసారి కూడా ఉరుగ్వే గోల్‌ పోస్ట్‌పై దాడిచేయలేకపోయింది. కాగా ఉరుగ్వే ఆరుసార్లు దాడి చేసింది. ఆట చివరి నిమిషం వరకు ఉరుగ్వే ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఈ మ్యాచ్‌ గెలుపుతో ఉరుగ్వే పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలచింది. రష్యా తొలి స్థానంలో ఉంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com