రొనాల్డో గోల్ తో విజయం- మొరాకోపై 1-0తో పోర్చుగల్‌ గెలుపు


పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అద్భుత గోల్‌తో తన జట్టుకు గెలుపు అందించడమేకాక చివరి 16 జట్లలోకి చేరేందుకు మార్గాన్ని చూపాడు. బుధవారం జరిగిన గ్రూప్‌ బి మ్యాచ్‌లో మొరాకోపై పోర్చుగల్‌ 1-0 తేడాతో గెలుపును నమోదు చేసింది. రియల్‌ మాడ్రిడ్‌ జట్టు తరఫున క్లబ్‌ మ్యాచుల్లో పాల్గొనే రొనాల్డో ఆట 4వ నిమిషంలోనే గోల్‌ చేసి తన కెరియర్‌లో అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ను నమోదు చేసుకున్నాడు. ఇది రొనాల్డోకి 85వ అంతర్జాతీయ మ్యాచ్‌ గోల్‌. దీనితో రొనాల్డో అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు హంగరీ ఆటగాడు ఫెరెన్‌ పుస్కాస్‌ పేర ఉంది. షార్ట్‌ కార్నర్‌ నుంచి సిల్వా అందించిన పాస్‌ను రొనాల్డో తన తలతో అందుకొని బంతిని మొరాకో గోల్‌ కీపర్‌ మునీర్‌ మహమొదీ అందకుండా కిక్‌ చేసి గోల్‌ చేశాడు. కాగా, ఈ టోర్నీలో రొనాల్డోకు ఇది నాలుగవ గోల్‌. అనంతరం ఆటలో రొనాల్డో పలుమార్లు మొరాకో గోల్‌పోస్ట్‌వైపుకు దూసుకుపోయినా.. ఫలితంలేకపోయింది. మిగతా ఆటలో ఇరు జట్లు గోల్స్‌కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. పోర్చుగల్‌ తన ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫల మైంది. ఈ విజయంతో పోర్చుగల్‌ గ్రూప్‌ బి పాయింట్ల పట్టికలో 4 నాలుగు పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. మొరాకో రెండు పరాజయాలతో దాదాపు పోటీ నుంచి నిష్క్రమించే దశకు చేరుకుంది. పోర్చుగల్‌కు నాలుగు కార్నర్‌ అవకాశాలు రాగా, మొరాకోకు 7 కార్నర్‌ అవకాశాలు వచ్చాయి. పోర్చుగల్‌ మొత్తం 11 సార్లు గోల్‌కోసం ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై దాడులు చేయగా, ఇందులో 6 ఆన్‌ టార్గెట్‌లున్నాయి. మొరాకో మొత్తం 15సార్లు గోల్‌కోసం దాడులు జరిపినప్పటికి అవి విఫల యత్నాలుగా మిగిలిపోయాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com