ఆ చిన్నారిని.. తల్లి నుంచి వేరుచేయలేదు ప్రపంచం దృష్టిని ఆకర్షించి.. టైమ్‌ కవర్‌ పేజీపైకి చేరిన చిన్నారి


అమెరికాలోకి అక్రమ వలసలను నిరోధించేందుకు ట్రంప్‌ యంత్రాంగం కఠిన చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. సరిహద్దు ప్రాంతాల గుండా అమెరికాలోకి వచ్చే అక్రమ వలసదారుల నుంచి పిల్లలను వేరుచేసి.. చిన్నారులను శిబిరాలకు తరలిస్తున్నారు. ఇలా పిల్లలను, తల్లిదండ్రులను వేరుచేయడంపై ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌ సర్కారు పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నిర్బంధ శిబిరాల్లో ఉంచే విధానానికి స్వస్తి పలుకుతూ కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేశారు.
అయితే హొండురాస్‌ ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి ఫొటో అందరినీ కదిలించింది. పింక్‌ జాకెట్‌ వేసుకొని తన తల్లిదండ్రుల కోసం ఏడుస్తోన్న ఆ చిన్నారి ఫొటోను రాబోయే టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై ప్రచురించింది. ట్రంప్‌ ఎదుట నిల్చొని రోదిస్తున్నట్లు ఉన్న ఈ చిన్నారి ఫొటోపై ‘వెల్‌కమ్‌ టు అమెరికా’ అని క్యాప్షన్‌ రాసి ఉంది. అయితే ఈ చిన్నారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

టెక్సాస్‌ సరిహద్దు ప్రాంతంలో చిన్నారి ఏడుస్తున్న ఫొటోను పలు ప్రముఖ మ్యాగజైన్లు ఉపయోగించుకున్నాయి. ట్రంప్‌ చర్యలతో తల్లిదండ్రులు, చిన్నారులు ఏవిధంగా మానసిక క్షోభకు గురవుతున్నారో ఈ ఫోటో కళ్లకు కట్టింది. అయితే ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేయలేదని సమాచారం. సరిహద్దు ప్రాంతంలో వారిని అడ్డుకున్నప్పటికీ.. చిన్నారిని తల్లి నుంచి వేరుచేయలేదని బాలిక తండ్రి డేనిస్‌ వలేరా తెలిపాడు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com