కోటి ఎకరాల మాగాణం కేసీఆర్‌ లక్ష్యం


కొట్లాడి సాధిం చుకున్న తెలంగాణలో కోటి ఎకరాల బీడు భూ ములకు నీరందించాలన్నదే సీఎం కేసీఆర్‌ ల క్ష్యమని ఈ క్రమంలోనే సూరమ్మ చెరువు రిజర్వాయర్‌గా మారబోతోందని వేములవాడ ఎ మ్మెల్యే రమేశ్‌ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కలికోట సూరమ్మ చెరువు కెనా ల్‌ నెట్‌ వర్క్‌ పనులను భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు ప్రారంభించగా సభ కు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూరమ్మ చెరువును ఎల్లంపల్లి నీటితో నింపితే కోరుట్ల, మేడిపల్లి, రుద్రంగి, మెట్‌పల్లి, చందుర్తి, కథలాపూర్‌ మండలాల్లోని దాదాపు 45 వేల ఎకరాల భూములు సస్య శ్యామలం కానున్నామన్నారు. ఎన్నికల సమ యంలోనే సీఎం కేసీఆర్‌ నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పిన హామీ ని నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. 1957 లోనే తన తండ్రి దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్‌ రావు గోదావరి నుంచి ఎత్తి పోతల పథ కంతో పై భాగంలో ఉన్న ప్రాంతాలకు నీళ్లు తేవాల ని అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందని అసెంబ్లీలో ప్రస్తావించారని గుర్తు చే శారు. ఆంధ్రా పాలకులు అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేలను హేళన చేసి ఒక్క పైసా కూ డా ఇవ్వమని చెప్పగా హరీశ్‌రావు ఆనాడే కొట్లాడారని చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి లక్షా ముప్పై వేల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశ పెట్టి 60 ఏళ్లలో జరగనంత అభివృద్ధి నాలుగున్నర ఏళ్ల లో చేసి చూపించారని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేలా ఆర్ధిక మంత్రి సభ లో హామి ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా అందు కు మంత్రి స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా విడత ల వారీగా వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నా రు. కాళేశ్వరం వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌ ని ర్మాణంతో దేశం గర్విస్తోందన్నారు. రూ. 94 వే ల కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌తో లక్షలాది ఎక రాలు సాగుకు నోచుకోనున్నా యని తెలిపారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com