అత్యాచారం కేసులో నిందితుడైన దాటీ మహారాజ్‌కు పుంసత్వ పరీక్షలు


న్యూఢిల్లీలో స్వయం ప్రకటిత దేవుడి అవతారం అని చెప్పుకునే దాటీ మహారాజ్ బాబాకు పోలీసులు పుంసత్వ పరీక్షలు (పొటెన్సీ టస్ట్) చేయించాలని నిర్ణయించారు. నాగా సెక్టార్ లోని చత్రాపూర్ ఆశ్రమంలో 2016లో తనపై దాతీ మహారాజ్ అత్యాచారం జరిపాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు సంవత్సరాల క్రితం తనపై అత్యాచారం జరిగినప్పటికి ప్రాణ భయంతోపాటు తన జీవితం అల్లరి పాలవుతుందని భయపడి విషయాన్ని బయటికి చెప్పలేదని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచారం జరిగిందని చెప్పిన రోజుల దాటీ మహారాజ్ ఆశ్రమంలో లేరని ఆశ్రమ వర్గాలు పలు ఆధారాలను పోలీసులకు సమర్పించాయి. డబ్బు వివాదం రేప్ కేసు పెట్టడానికి కారణమైందని ఆశ్రమం నిర్వాహకులు చెపుతుండగా... భక్తురాలినైన తనపై దాటీ మహారాజ్ పలుసార్లు అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. దాటీ మహారాజ్ కోరిక తీర్చాలని కోరుతూ తనకు పలు సార్లు ఫోన్ చేశాడని మహిళ ఆరోపించిన నేపథ్యంలో పోలీసులు బాబా మొబైల్ కాల్ డేటా రికార్డులను సేకరించాలని నిర్ణయించారు. దీంతో పాటు అత్యాచారం కేసులో దాటీ మహారాజ్ ను ప్రశ్నించిన పోలీసులు అతనికి పుంసత్వ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com