jaiandhratv CMD Tetali Durgareddy-Supriya Engagement Ceremony


జై ఆంధ్ర టీవీ సిఎండి తేతలి దుర్గారెడ్డి నిశ్చితార్ధపు వేడుకలు ప.గో జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామం లో ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడకు చెందిన తేతలి ప్రభాకర్ రెడ్డి కుమారుడు దుర్గారెడ్డికి ప.గో జిల్లా కవిటం గ్రామానికి చెందిన మండ కాశీ విశ్వేశ్వర రెడ్డి కుమార్తె సుప్రియాకి శనివారం కళ్యాణ తాంబూల నిశ్చితార్ధం శుభప్రదంగా జరిగింది. ముందుగా ఈ కార్యక్రమం లో వధూవరులు ఇద్దరినీ సీతారాముల్లా అలంకరించి పట్టువస్త్రాలతో పెద్దల ఆశీర్వాదంతో తేతలి వారి కుటుంబానికి మండవారి లక్ష్మీదేవిని పంపించడానికి పసుపుకుంకుమలు ఇచ్చిపుచ్చుకున్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కుందుల సత్యనారాయణ , స్థానిక ఎమ్మెల్యే మంత్రి పితాని కుమారుడు పితాని వెంకట్ మరియు ఎమ్మెల్యేలు , పోలీస్ అధికారులు మరియు జై ఆంధ్ర టీవీ ప.గో జిల్లా టీమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇద్దరివైపు నుండి బంధువులు భారీగా తరలివచ్చి కాబోయే వధూవరులను ఆశీర్వదించి విందు బోజనాల్లో పాల్గొన్నారు.అనంతరం వచ్చిన బందువులకు ,స్నేహితులకు కానుకలు అందించి , మర్యాదపూర్వకంగా పంపించారు.
for video click on to this : https://youtu.be/4NzAM3rKocM

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com