
ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసిన కవిత

సంస్థల కోటా స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్లో ఆమె నామినేషన్ వేశారు. ఆమెతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గంప గోవర్ధన్, సురేందర్ తదితరులు ఉన్నారు. కాగా, టీఆర్ఎస్ నుంచి పలువురు ఆశావాహులు టికెట్ ఆశించినప్పటికి పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించని ఆమె ఈ నెల 13న జరిగిన పార్టీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు