గొల్లల మామిడాడ పై కరోనా పంజా..


జై ఆంధ్ర టీవీ న్యూస్ డెస్క్:
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన గొల్లలమామిడాడ పై కరోనా పంజా విసిరింది. దీంతో సుమారు మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ప్రశాంతతకు మారుపేరుగా పేరుపొందిన గొల్లల మామిడాడ లో కరోనా దెబ్బతో గ్రామం అస్తవ్యస్తంగా మారింది. నిరంతరం అనేక మందికి ఉపాధి కల్పిస్తూ జీవనాధారం గా ఉండే గొల్లలమామిడాడ ఇప్పుడు తాగడానికి నీళ్లు పాలు లేక విలవిలలాడుతోంది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. గొల్లల మామిడాడ చెందిన యువత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గొల్లలమామిడాడ యువతీయువకులను శభాష్ అంటూ ఉంటారు. ఇదే గ్రామం చెందిన ప్రముఖులు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు అంటే ఆ గ్రామంలో ఉన్న విశిష్టత ఏంటో ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఇదే గ్రామం నుండి సుమారు పది మంది జడ్జిస్,50 మంది డాక్టర్స్, హై కోర్ట్ అడ్వకేట్, రాజకీయ నాయకులువున్నారు. గొల్లలమామిడాడ కు చెందిన యువకులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు అంటే గొల్లలమామిడాడ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు గొల్లలమామిడాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చిన మావిడాడ కరోనాతో విలయతాండవం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరూ బాధపడే విషయంగా మనం చెప్పుకోవాలి. ఎంతోమంది ఇది ఉన్నత స్థాయికి వెళ్లడానికి తోడ్పడిన గొల్లలమామిడాడ నేడు కరోనా పంజా కు గురైంది. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానూ మరియు వాణిజ్య కేంద్రంగానూ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన గొల్లలమామిడాడ నేడు కరోనా కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందంటే దానికి బాధ్యులు ఎవరు.. నిత్యం ప్రజలతో కలకలలాడే గొల్లలమామిడాడ లో ఇప్పుడు బారికేడ్లుతో నిర్మానుష్యమైన రోడ్లు దర్శనమిస్తున్నాయి అంటే కారణం ఎవరు? లాక్ డౌన్ పూర్తిస్థాయిలో అమలు చేసి ఉంటే నేడు కరోన గొల్లల మామిడాడ పై పంజా విసిరి ఉండగలదా?? అయితే లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వ అధికారులు సఫలీకృతమైన, కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ అధికారులకు తెలియకుండా పార్టీలు నిర్వహించడంతో ఈ వ్యాధి గొల్లలమామిడాడ పై పంజా విసిరింది. ఇకనైనా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించి కరోనాని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలి.

స్టోరీ బై:TDR

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com