మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సవాల్..


ఏపీ త్రయం గ్రామంలో లబ్ధిదారులకు అందజేసిన స్థలాల విషయంలో దిగజారుడు రాజకీయాలు చేసిన మాజీ ఎమ్మెల్యే దమ్ముంటే లబ్ధిదారులతో కలసి ఈ స్థలాలు వద్దంటూ ధర్నా చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఏపీ త్రయం గ్రామంలో ఇళ్ల స్థలాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి భూమి పూజ చేసి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి అతి సమీపంగా ప్రధాన రహదారికి చేర్చి లక్షల విలువచేసే స్థలాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ స్థలాలు లబ్ధిదారులకు దక్కకుండా ప్రతిపక్ష నాయకుడు చేయని దిగజారిన రాజకీయం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ ఇళ్ల స్థలాల ప్రాంతం ముంపు ప్రాంతమని ఏ విధంగానూ నివాసయోగ్యం కాదని తప్పుడు కూతలు కూసిన మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ నగరం సైతం వర్షాలకు మునిగిపోతున్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు . కేవలం అర్హులకు ఈ విలువైన స్థలాలు దక్కకుండా చూడాలని ఎన్నో కుయుక్తులు పన్నారన్నారు. మీ హయాంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏ జెండా లేకుండా పాలన సాగించిన వైనం ప్రజలందరికీ తెలుసన్నారు. వారి హయాంలో లో కేవలం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పేదింటి సొంత ఇల్లు నిర్మాణాల మహాయజ్ఞాన్ని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. స్థలాలు పొందిన ప్రతి ఒక్క లబ్దిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టి అతి త్వరలో గృహప్రవేశాలు చేయాలని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఆకాంక్షించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com