భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ..


తిరుమల : రూమ్స్ మరింత సులభతరం చేసింది టీటీడీ. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీఎన్ సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, సీఆర్ఓ, రామ్ భగీచ, ఎంబీసీ వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలను నెలకొల్పారు. ఇక ఈ కేంద్రాలను శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా సులువుగా అద్దె గదులు పొందవచ్చని తెలిపారు.

ఆరు కౌంటర్లలో ఎక్కడైన గదులు బుక్ చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం గదులు కేటాయించే సీఆర్ఓ కార్యాలయం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండటం, వాహనాల పార్కింగ్ సమస్యలు తలెత్తుతుండటంతో వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ధర్మారెడ్డి. ఆన్లైన్లో వసతి గదులు బుక్ చేసుకున్న భక్తులు నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గది కేటాయించిన సమాచారం రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు సందేశం రూపంలో పంపుతారని వివరించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com