కరోనా కి దడ పుట్టిస్తున్న కవిటం కరోనా మందు...


ఉభయగోదావరి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరు. ఆధ్యాత్మికత, వైద్య ,విద్య వ్యవసాయ ,ఆక్వా రంగాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. భూ కనిజాలు పుష్కలంగా దొరికే ప్రాంతాలుగా ఉభయగోదావరి జిల్లాలకు ప్రసిద్ధి.
అలాగే తూర్పు గోదావరి జిల్లా వెల్ల గ్రామంలో కామెర్లకు తయారయ్యే ఆయుర్వేద మందు ప్రసిద్ధి. ఈ మందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుండి ప్రజలు క్యూ కడతారు. అలాగే కుక్క కాటుకు ఆయుర్వేద మందుకు కవిటం గ్రామం ప్రసిద్ధి.. ఇప్పుడా ఆ కవిటం గ్రామాల్లోనే కరోనా నివారణకు ఆనందయ్య ఫార్ములాతో ఆ గ్రామానికి చెందిన యువకులు ఎంతో కష్టపడి ఆయుర్వేద మందులు తయారు చేశారు..
తొలుత గ్రామంలో కొంతమందికి మాత్రమే ఈ మందు పంపిణీ జరిగింది. ఆయుర్వేద మందు ను ఆ గ్రామ యువకులు రెండు రకాలుగా తయారు చేశారు. మొట్టమొదట కరోనా నివారణకు ఒకరకమైతే, కరోనా వచ్చిన వారికి మరో రకం ఆయుర్వేద మందు తయారు చేశారు. అయితే ఈ మందు వాడిన అనేక మంది కరోనా బారిన పడకుండా తప్పించుకోవడమే కాకుండా, వచ్చినవారు రెండు రోజుల్లోనే కోలుకోవడం మరో విశేషం. అయితే ఏ మంచి పనికైనా ముందుండే కవిటం యువకులు ఈ మందు తయారు చేయడానికి కూడా ముందు ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఈ గ్రామంలో అనేక మంది మృత్యువాత పడ్డారు. కరోనా సమయంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కవిటం గ్రామంలో కి వెళ్లాలంటే భయపడేవారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు యువకులు ఆనందయ్య ఫార్ములాను తీసుకొని ఒక ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఆయుర్వేద మందులు తయారు చేశారు. దీంతో ఆ మందు మంచి సక్సెస్ అయింది. సక్సెస్ ఇస్తున్న ఆయుర్వేద మందును తయారుచేసిన కవిటం గ్రామం వైపు మిగిలిన గ్రామాలు చూస్తున్నాయి. అయితే కవిటం గ్రామంలో తయారైన ఈ మందు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, కలకత్తా ప్రాంతాలకు పంపుతున్నట్లు ఆ గ్రామానికి చెందిన యువకులు తెలిపారు.
ఈ ఆయుర్వేద మందు విషయం తెలుసుకున్న జై ఆంధ్ర టీవీ ప్రతినిధులు కరోనా వచ్చిన వారికి కవిటం గ్రామంలో తయారైన ఈ మందును అందజేశారు . ఈ మందులు వాడిన వారు గంటల వ్యవధిలోనే కరోనా నుండి కోలుకున్నారు.. దీనిపై గ్రామంలోని యువకులును కలిసి వివరణ కోరగా తాము చేసే ఈ సేవ పూర్వ జన్మ సుకృతం, తాము చేసిన ఈ మందును ఎంతోమంది ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఆనందయ్య ఫార్ములా బట్టి ఈ మందులోకి చిగురాకులు మాత్రమే వాడుతున్నామని ఇది చాలా కష్టమైనప్పటికీ తమ ఊరు కోసం , వీలైనన్ని కుటుంబాలను కరోనా నుండి రక్షించడానికి తమ సేవ చేస్తామని తెలిపారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com