జీవితానికి కూడా ఓ అవకాశం ఇద్దాం: నాని


హైదరాబాద్‌: వరుస విజయాలతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న కథానాయకుడు నాని. ఆయన నటించిన చిత్రం ‘నిన్నుకోరి’. శివ నిర్వాణ దర్శకుడు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జులై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నాని మీడియాతో ముచ్చటించారు.
‘నిన్ను కోరి’తో ఏం కోరుతున్నారు?
‘మీ అందరికీ ఈ సినిమా నచ్చాలని కోరుతున్నాం. ఇది బేసిక్‌గా ప్రేమకథ. ఈ మధ్య భావోద్వేగ అంశాలకు కాస్త దూరమయ్యాం. మనకి ఆప్షన్స్‌ ఎక్కువైపోయి.. రెండు నిమిషాల ఎమోషనల్‌ సన్నివేశాన్ని కూడా చూడలేక ఫోన్‌ చూసుకుంటున్నాం. పూర్తిగా మనని నిమగ్నం చేసే సినిమాలు తక్కువైపోతున్నాయి. అలాంటి సమయంలో వచ్చిన సినిమా ఇది. కథ వింటున్నప్పుడే నాకు తెలీకుండా భావోద్వేగానికి గురయ్యా. నేను వింటున్నప్పుడు ఎలా ఫీల్‌ అయ్యానో, సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అదే ఫీల్‌ అయితే చాలా మంచి సినిమా అవుతుందనిపించింది’.
రెగ్యులర్‌గా ప్రేమకథలే చెయ్యడానికి కారణం?
‘నా సినిమానే కాదు. మీరు ఏ సినిమా తీసుకున్నా అందులో ప్రేమకథ ఉంటుంది. ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’ లాంటి సినిమాల్లో కూడా ప్రేమకథ ఉంది. ‘నిన్ను కోరి’ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇలాంటి ప్రేమకథ నేను చేయలేదు. ఇది నాకు పూర్తిగా కొత్త సినిమా అని చెప్పొచ్చు. తర్వాత నేను చేస్తున్న ‘ఎం.సి.ఎ.’లో కూడా ప్రేమకథ ఉంది. కానీ, ప్రేమకథా చిత్రం కాదు’.
‘నిన్ను కోరి’లో మీకు నచ్చిన అంశం?
‘ఏదైనా చిన్న సమస్య రాగానే జీవితం అయిపోయింది అనుకుంటూ ఉంటాం. ఎవరైనా మంచి చెప్పాలని ప్రయత్నించినా.. లేదు, నా జీవితం అయిపోయింది అంటుంటాం. ఏదో తెలియని చెడు ఆలోచనల్లోకి వెళ్లిపోతాం. చిన్న సమస్య రావడం వల్ల.. పూర్తయిపోయేంత చిన్నది కాదు జీవితం. ఒక్కసారి మనం జీవితానికి స్వాగతం చెప్తే అది మనకు ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇస్తుంది. ఈ సినిమా చివరిలో ఓ లైన్‌ చెప్పాం. ‘లైఫ్‌ మనకి బోలెడన్ని ఛాన్సులిస్తుంది. మనం లైఫ్‌కి ఒక ఛాన్స్‌ ఇద్దాం’.. ఈ లైన్‌తో మనం ఏం చేయాలో పూర్తిగా అర్థం అవుతుంది’.
ఆదిని తీసుకోవాలన్న ఆలోచన ఏవరిది?
‘మొదట కథ కుదిరాక నాతోపాటు ఉండే పాత్రకి ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు అందరూ ఆది పేరునే చెప్పారు. ఆది కూడా ఒప్పుకొన్నారు. నివేతా కూడా మాకు తొలి ఛాయిసే. ఆమె తప్ప ఈ పాత్ర ఎవరూ చేయ్యలేరు అనిపించింది’.
నిర్మాత దానయ్య గురించి?
‘దానయ్య నిర్మాతగా ఎన్నో పెద్ద కమర్షియల్‌ సినిమాలు చేశారు. అలాంటిది కథ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నిర్మాతగా ఎవర్ని అనుకుంటున్నారు అంటే దానయ్య అని చెప్పారు. ఆయనకి కథ బాగా నచ్చింది అన్నారు. తొలిసారి మన భవిష్యత్తు సేఫ్‌ హ్యాండ్‌లో ఉందనిపించింది. ఆయన అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చూసే అవకాశం ఉన్నా, సినిమా చూడలేదు. కుటుంబంతో కలిసి థియేటర్లో చూస్తానన్నారు. ఆయనకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం అది’.
కోన వెంకట్‌ గురించి?
‘మా కో-ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌ మా యు.ఎస్‌ ట్రిప్‌ని అంతా ఆయనే చూశారు. నేను, ఆది, నివేతా కలిసి మాట్లాడుకునేటప్పుడు కోన కూడా మాలో చేరిపోయేవారు’.
ఆడియోకి మంచి స్పందన చూస్తే ఏమనిపిస్తోంది?
‘చాలా సంతోషంగా ఉంది. గోపీసుందర్‌ సంగీతం సినిమాకి బలం అని చెప్పాలి. సినిమా ప్రచారంలో భాగంగా మొదట రిలీజ్‌ చేసిన ‘అడిగా అడిగా’ పాటకు దాదాపు 10 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయంటే మామూలు విషయం కాదు. మిగతా పాటలు కూడా అందరికీ నచ్చాయి’.
మీ తర్వాతి ప్రాజెక్టు?
‘ ‘ఎం.సి.ఎ.’ షూటింగ్‌ జరుగుతోంది. తర్వాత మేర్లపాక గాంధీ సినిమా ఆగస్టులో ప్రారంభం అవుతుంది. ‘నిన్ను కోరి’ విడుదల అయిన వారం రోజుల్లో ఆ సినిమా టైటిల్‌, మిగతా వివరాలు ప్రకటిస్తాం. ఇది కాక వచ్చే ఏడాది మిలట్రీ నేపథ్యంలో ఓ సినిమా చెయ్యబోతున్నా. తొలిసారి ఆ తరహా సినిమా చేస్తున్నా’ అని నాని చెప్పారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com