మొటిమలున్న అమ్మాయిలంతా నన్ను చూసి.


వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఫిదా’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. శుక్రవారం(జులై 21)న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. చిత్రం చూసిన వారంతా సాయిపల్లవి నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కాగా తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిపల్లవి మాట్లాడారు. సినిమా, వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు.
‘‘ఫిదా’లో భానుమతి పాత్ర గురించి చెప్పినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. నా వ్యక్తిత్వానికి భిన్నమైన పాత్ర ఇది. నేను చేయగలనో, లేదో.. నా ముఖ కవళికల్లో ఆ భావాలు పలుకుతాయో లేదో అనుకున్నా. కానీ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ‘నీకు బావుంటుంది. నువ్వు చేయగలవు’ అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. ఆయన నమ్మకమే ఈ సినిమా. సెట్‌లో ఆయన ఏం చెబితే అదే చేశా. భానుమతి పాత్రకు కొన్ని ప్రత్యేకమైన భావాలు ఉంటాయి. ఆ పాత్ర చేసినప్పటి నుంచి ఇంట్లో కూడా నేను భానుమతిలాగే మారిపోయాను’.
‘ఇందులో నేను పవన్‌కల్యాణ్‌ అభిమానిని. ఆ పాత్ర కోసం ‘గబ్బర్‌ సింగ్‌’ చూశా. ‘ఫిదా’ సినిమాలో పవన్‌కల్యాణ్‌ కనిపించగానే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం గమనించా. నా గురించి కొట్టారా?, పవన్‌కల్యాణ్‌ గురించి కొట్టారా? అని కాసేపు తికమకపడ్డా. ఆయన గురించే అని తర్వాత అర్థం అయ్యింది’.
‘ డైలాగ్స్‌ను ఒకటికి పదిసార్లు చదువుకునే దాన్ని. సెట్‌లో అందరితోనూ తెలుగులోనే మాట్లాడేదాన్ని. దాంతో భాష సులభంగా నేర్చుకున్నా. ఒక్క భాష అనే కాదు, నేను వూహించని చాలా పనుల్ని ఈ సినిమా కోసం చేశా. ట్రాక్టర్‌ తోలడం నుంచి నాట్లు వేయడం వరకు.. చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు అంతా తెరపై నన్ను చూసి ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నారు. నేను కూడా సాయిపల్లవి లాగే ఉంటానని అంటున్నారు. నా దర్శకులంతా నన్ను నాలాగే చూపించడానికి ఇష్టపడ్డారు. అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’.
‘మలయాళంలో ‘ప్రేమమ్‌’ తర్వాత ఆ సినిమా తెలుగు రీమేక్‌లో నువ్వు కూడా నటిస్తున్నావా? అని చాలా మంది అడిగారు. కానీ నన్ను ఎవరూ సంప్రదించలేదు. ‘ప్రేమమ్‌’ మ్యాజిక్‌ మళ్లీ పునరావృతం అవుతుందో లేదో తెలియదు కాబట్టి.. నేను తెలుగు రీమేక్‌లో నటించాలి అనుకోలేదు. ఇప్పుడు ‘ఫిదా’ రీమేక్‌ చేసినా నటిస్తానో లేదో తెలియదు’.
‘వరుణ్‌తేజ్‌ చాలా ప్రొఫెషనల్‌ నటుడు. ఏ సన్నివేశానికి ఎంత కావాలో అంతే నటిస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. ప్రస్తుతం నానితో కలిసి ‘ఎం.సి.ఎ’లో నటిస్తున్నా. అందులో నేను మధ్యతరగతి అమ్మాయిని. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ పూర్తి చేశా. కార్డియాలజీ చదవాలని ఉంది. నటనకు వయసు, అందం ముఖ్యం. కానీ వైద్య వృత్తికి అది అవసరం లేదు. అందుకే సినిమా కెరీర్‌ తర్వాత వైద్య వృత్తిలో కొనసాగుతా’.
‘రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ అంటే నాకు ఇష్టం. ‘కాకా కాకా’ సినిమాలో సూర్యను చూసి అభిమానిగా మారాను. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే సంతోషిస్తా’ అని సాయిపల్లవి చెప్పారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com