'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ


టైటిల్ : ఆనందో బ్రహ్మ
జానర్ : కామెడీ హర్రర్
తారాగణం : తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్
సంగీతం : కృష్ణ కుమార్
దర్శకత్వం : మహి.వి. రాఘవ్
నిర్మాత : శశి దేవిరెడ్డి, విజయ్ చిల్లా, సందీప్ రెడ్డి, సృజన్ ఎఱబ్రోలు

ఒకప్పుడు తెలుగు తెర మీద సక్సెస్ ఫార్ములాగా ఓ వెలుగు వెలిగిన హర్రర్ కామెడీలు తరువాత ఆడియన్స్ కు బోర్ కొట్టేశాయి. దీంతో ఆ జానర్ సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. తాజాగా అదే జానర్ లో ప్రేక్షకుల ముందు వచ్చిన మరో సినిమా ఆనందో బ్రహ్మ. అయితే రెగ్యులర్ హర్రర్ కామెడీలకు భిన్నంగా దెయ్యాలే మనుషులని చూసి భయపడే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది..? ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శల పాలైన తాప్సీని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరించారు..?

కథ :
తల్లిదండ్రులను కోల్పోయిన.. ఎన్నారై రాము (రాజీవ్ కనకాల) వారికి జ్ఞాపకాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వారి నివసించిన ఇంటిని అమ్మకాని పెడతాడు. అయితే అప్పటికే ఆ ఇంట్లో రెండు కుటుంబాలకు చెందిన దెయ్యాలు నివసిస్తుంటాయి. ఇళ్లు కొనటానికి ముందుకు వచ్చినవారందరూ దెయ్యాల దెబ్బకు భయపడి పారిపోతారు. దీంతో ఇంట్లో దెయ్యాలున్నాయన్న నమ్మకాన్ని చెరిపేసేందుకు ఇంటిని అద్దెకివ్వాలని నిర్ణయించుకున్నాడు రాము. ఇంట్లో మూడు రోజులు ఉండి దెయ్యాలు లేవని చెప్తే కోటీ రూపాయిలు ఇస్తాననటంతో సిద్ధూ (శ్రీనివాస్ రెడ్డి) ఇంట్లో ఉండేందుకు ముందుకు వస్తాడు.

తనతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులకు తలా పది లక్షలు ఇస్తానన్న ఒప్పందతో ఇంట్లోకి తీసుకువస్తాడు. అలా దెయ్యాలు నివసించే ఇంట్లోకి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, ఫ్లూట్ రాజు (వెన్నెల కిశోర్), బాబు (షకలక శంకర్), తులసి (తాగుబోతు రమేష్) ఎలాంటి ఇబ్బందులు పడ్డారు..? అసలు అలాంటి ఇంట్లో ఉండేందుకు వారు ఎందుకు అంగీకరించారు..? ఆ ఇంట్లో ఉంటున్న దెయ్యాలు ఎవరు..? రాము ఆ ఇంటిని ఎందుకు అమ్మాలనుకుంటున్నాడు..? అన్నదే మిగతా కథ.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com