అలసటా.. ఓ కునుకు తీయండి!


వారంలో మొదటి రోజును ఉత్సాహంగా ప్రారంభించాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు శరీరం సహకరించదు. అలసటగా అనిపించొచ్చు. పనిపై ఆసక్తీ తగ్గిపోవచ్చు. మరెలా అంటారా.. రండి ఈ సమస్యల్ని ఎలా అధిగమించాలో చూద్దాం.
వ్యాయామం: మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ వ్యాయామాన్ని మీ దినచర్యలో తప్పనిసరిగా చేర్చుకోండి. ఉదయం పూట దీనికి సమయాన్ని కేటాయించుకోండి. వ్యాయమాం చేయడం వల్ల కలిగే లాభాలను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కండరాల పటుత్వానికి, రక్తప్రసరణ సాఫీగా సాగడానికి, శరీరం, మెదడూ చురుగ్గా ఉండేందుకు వ్యాయామం తోడ్పడుతుంది. ప్రతిరోజు ఓ అరగంట పాటు నడిచినా ఆరోగ్యానికెంతో మంచిది.
నీరు: మీ శరీరానికి తగినంత నీరు లభించనప్పుడు డీహైడ్రేషన్‌ సమస్య తప్పదు. దానివల్ల శరీరంలోని శక్తినంతా ఎవరో లాగేసినట్లు అవుతుంది. అలసట తప్పదు. ఆ ప్రభావం మీ రోజువారి పనులపైనా పడుతుంది. కాబట్టి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తీసుకోవాలి.
విరామం: పనిచేసేటప్పుడు అరగంటా, గంటకోసారి ఐదు నిమిషాల పాటు చిన్న విరామం తీసుకోవాలి. కాసేపు అటూ ఇటూ నాలుగడుగులు వేయండి. మీ కంటికి, మెదడుకు విశ్రాంతినిచ్చినవారవుతారు.
ఆహారం: పొద్దుటిపూట తీసుకునే ఆహారంలో మాంసకృత్తులూ ఉండేలా చూసుకోండి. పిండిపదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయులు విడుదలై తక్షణం ఉత్సాహంగా అనిపించినా.. తరవాత త్వరగా అలసిపోతారు. అదే మాంసకృత్తులతో అయితే ఈ సమస్య ఉండదు. అరటిపండ్లు, బంగాళాదుంపలూ.. వంటివి మీ ఆహారంలోకి చేర్చుకోవాలి. ఈ పోషకాలు మీ మెదడుకు శక్తిని అందిస్తాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com