దంత రక్షణకు వేప!


ఉసిరి: దీనిలో యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి నోటిలోని హానికర బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడి చిగుళ్లను కాపాడతాయి. ఉసిరి సహజ క్లెన్సర్‌లా పనిచేసి నోటి దుర్వాసననూ పొగొడుతుంది. కాబట్టి రోజూ ఓ ఉసిరిని తినేయండి. లేదా పావు చెంచా ఉసిరిపొడిని అరకప్పు నీటిలో కలిపి తాగినా ఫలితం ఉంటుంది.

వేపాకు: వేపలో చాలా ఔషధ గుణాలుంటాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అంతమొందిస్తాయి. అంతేకాదు దంతాలకూ, చిగుళ్లకూ బలాన్ని, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. కొన్ని చుక్కల వేపరసంతో మీ పళ్లూ, చిగుళ్లపై మృదువుగా రాయాలి. కాసేపాగి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

లవంగం: ఇందులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు పంటి నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. చిగుళ్ల సమస్యలు పెరగకుండా నియంత్రిస్తాయి. పావు చెంచా నువ్వుల నూనెలో కొన్ని చుక్కల లవంగం నూనె కలిపి, అందులో దూది ఉండను ముంచి పంటినొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టాలి. బుగ్గన రెండు లవంగ మొగ్గలు పెట్టుకున్నా ఉపశమనం లభిస్తుంది.

వంట సోడా: దీనిలోని ఆల్కలైన్‌ సమ్మేళనాలు నోటిలో ఎక్కువైన ఆమ్లాలను పీల్చుకుంటాయి. దంత క్షయానికీ, చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే ఆమ్లాలను వంటసోడాలోని ఆల్కలైన్‌ సమ్మేళనాలు నియంత్రిస్తాయి. దాంతో నోటిలో వాటి తీవ్రత తగ్గుతుంది. అయితే తరచూ వాడటం వల్ల పళ్ల ఎనామిల్‌కు హాని జరగొచ్చని మరవకూడదు. ఇలాంటి చిట్కాలు ఒకటిరెండురోజులు ప్రయత్నించి చూడొచ్చు. అప్పటికీ తగ్గకపోతే దంతవైద్యుల్ని సంప్రదించడం తప్పదు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com