పొట్ట తగ్గించండిలా...!


* అమితంగా తినడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మరి దాన్ని తగ్గించాలంటే తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలి. ముఖ్యంగా చిప్స్‌, వేపుళ్లూ, పేస్ట్రీలూ, శీతలపానీయాల్లాంటివాటిని తగ్గించాలి. తాజా కాయగూరలూ, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితోపాటూ ప్రతిరోజూ అరగంట సేపు వ్యాయామం తప్పనిసరి.
* టీనేజీ అమ్మాయిలతో పోలిస్తే మహిళల్లో అధిక బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. దీనికి కారణం వారిలో ముప్పయి ఏళ్లు దాటాక జీవక్రియల రేటు తగ్గిపోవడమే. దీనికి తోడు హార్మోన్ల అసమతౌల్యం కూడా ఓ కారణం. కాబట్టి ఈ పరిస్థితి ఎదురుకాకముందు నుంచే మేల్కోవాలి.
* కొత్తగా కసరత్తులు ప్రారంభించేవారు ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
* ఆఫీస్‌, ఇల్లూ వాతావరణం, పెరుగుతున్న పనిగంటలూ, అదనపు బాధ్యతలు...ఇవన్నీ సహజంగానే ఒత్తిడికి గురిచేస్తాయి. ఒత్తిడి వల్ల కూడా కొద్దిమంది ఎక్కువగా, కంటికి కనిపించినవన్నీ తినేస్తుంటారు. దాంతో బరువూ పెరుగుతారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందులో భాగంలో మీకు నచ్చిన ఏదైనా వ్యాపకం పెట్టుకోవచ్చు.
* నిద్రలేమి వల్ల కూడా బరువు పెరుగుతారు. నిద్ర తగ్గిపోవడం వల్ల అలసటగా, బడలికగా ఉంటుంది. దాంతో తక్షణ శక్తి కోసం కాఫీ, టీలు ఎక్కువగా తాగుతారు. వీటినిలోని చక్కరతో కూడా కెలొరీలు పెరుగుతాయి. కాబట్టి వీటిని తగ్గించి ప్రతిరోజూ కంటి కంటినిండా నిద్రపోవడానికి ప్రయత్నించాలి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com