వయసు 65 దాటిందా...


ఓ వయసు వచ్చాక ముఖ్యంగా అరవైఅయిదేళ్లు దాటాక ఇంటి పనులు తగ్గించేస్తుంటారు కొందరు మహిళలు. కానీ చురుగ్గా ఉంటూ ఇంటిపనులూ ఎన్నో కొన్ని చేయడం వల్ల శరీరానికి శక్తి అందడమే కాదు.. ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతోంది ఓ అధ్యయనం. రోజువారీ చేసే ఇంటిపనులు అరగంట చేసే వ్యాయామాలతో సమానం అని వివరిస్తోంది. అమెరికన్‌ జీరియాట్రిక్స్‌ సొసైటీ అధ్యయనం ప్రకారం.. ఏదో విధంగా చేసే అరగంట వ్యాయామం జీవితకాలాన్ని పన్నెండు శాతం పెంచితే, అదనంగా చేసే ఇంటిపనులూ ఆరోగ్యానికి మరెంతో మేలు చేస్తాయట. ప్రతి కదలికకూ ఓ లెక్క ఉంటుందని చెబుతున్నారు యానివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్‌ ఆండ్రియా. రోజువారీ మనం చేసే పనులు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయనీ, ముఖ్యంగా చిన్న చిన్న అవసరాల కోసం ఆటోలు ఎక్కడం ఇతరుల సాయం తీసుకోవడం కన్నా నడవడం, ఆరేసిన దుస్తులు మడత పెట్టడం, ఇల్లు సర్దడం.. వంటివి చేయడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని చెబుతున్నారు. సుమారు 65 నుంచి 99 ఏళ్లలోపున్న ఆరువేలమందిపై అధ్యయనం నిర్వహించి వాళ్లు తేల్చిన వాస్తవం ఇది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com