కనుబొమల్ని దిద్దుకోండిలా...


అందంగా కనిపించాలంటే కనుబొమల్ని చక్కగా తీర్చిదిద్దుకుంటే చాలనుకుంటున్నారు నేటితరం మహిళలు. నిజానికి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని పాటిస్తున్నారు కూడా. ఈ క్రమంలో కొందరు సొంతంగా ఇంట్లోనే పెరిగిన కనుబొమల్ని తీసుకుంటే... మరికొందరేమో పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. ఏది ఏమైనా ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి.

* ఏదైనా సందర్భం ఉన్నప్పుడు కనీసం రెండు రోజులు ముందుగా కనుబొమలను తీర్చిదిద్దుకోవడం మంచిది. దానిమూలంగా వచ్చిన మార్పు సహజంగా కనిపిస్తుంది. అలానే తరచూ చేయించుకునే అవసరం ఉన్నవారు... ఓ పద్ధతిప్రకారం నెలకోసారి చేయించుకోవడం మంచిది.
* మరికొందరేమో కనుబొమలు ఓసారి బ్యూటీపార్లర్‌లో తీయించుకున్నాక కొన్నినెలలపాటు అదనంగా పెరిగిన వాటిని ప్లక్కర్‌తో తీసేస్తుంటారు. దీనివల్ల వాటి సహజ ఆకృతి దెబ్బతినే ప్రమాదం ఉంది. తరచూ తీయడం వల్ల అవి సరిగ్గా పెరగకపోవచ్చు కూడా. అందుకే ఎంత తీరిక లేకపోయినా పార్లర్‌లోనే వాటిని దిద్దుకోవడం మంచిది.
* కనుబొమల్ని సొంతంగా తీర్చిదిద్దుకోవాలనుకునేవారు వాటిని వ్యతిరేక దిశలో తీసుకోవాలి. లేదంటే అవి అందవిహీనంగా కనిపించే అవకాశం ఉంది. అంతేకాదు.. నొప్పీ, చర్మం కమిలిపోవడం, దద్దుర్లూ వంటి సమస్యలూ ఎదురవుతాయి.
* కనుబొమల్ని మీకు మీరే తీసుకునే ముందు వాటిపై కొద్దిగా పెట్రోలియంజెల్లీ లేదా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఆ తరవాత కూడా ఐసుముక్కతో అద్దుకుంటే మంట ఉన్నా తగ్గుతుంది. అలానే ట్వీజర్‌లని ఉపయోగించడానికి ముందు యాంటీ సెప్టిక్‌లోషన్‌తో కానీ వేణ్ణీళ్లతో కానీ శుభ్రం చేయడం మంచిది.
* ఐబ్రోపెన్సిల్‌ని వాడేముందు.. కనుబొమల మీదుగానే దిద్దుకోవాలి తప్ప.. మరీ వెడల్పుగా కాదు. వీలైనంతవరకూ వాటి ఆకృతి ఏ మాత్రం చెడిపోకుండా చూసుకోవాలి. అప్పుడే అవి సహజంగా, అందంగా కనిపిస్తాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com