google పిలుస్తోంది!


అధునాతన టెక్నాలజీ అభివృద్ధి, వినియోగ రంగాల ప్రారంభ పరిశ్రమల స్థాపనలో అమెరికా తర్వాతి స్థానంలో మనదేశమే ఉంది. ఈ విషయంలో 2021 నాటికి అమెరికాని అధిగమించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. కొత్త టెక్నాలజీలను ఆదరించి, ఉపయోగించడంలో భారతీయులు ముందున్నారు. కానీ వినూత్నత్వంలో చైనా కంటే వెనుకబడి ఉన్నారు. ఈ రంగంలో కూడా భారతీయులను ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్‌లో అగ్రగామి శిక్షణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని గూగుల్‌ ఇప్పటికే దాదాపు 2,60,000 మందికి అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థ ఉడాసిటీ ద్వారా మన డెవలపర్లు గూగుల్‌ సంస్థ రూపొందించిన కోర్సుల్లో శిక్షణ పొందారు.

ఈసారి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో శిక్షణ అందించే ప్రముఖ సంస్థ ప్లూరల్‌సైట్‌ వెబ్‌సైట్‌ ద్వారా 1,00,000 మందికి, ఉడాసిటీ వేదికపై 30,000 మందికి శిక్షణ ఇప్పించాలని గూగుల్‌ నిర్ణయించింది. ఆ మేరకు ప్రకటన చేసింది. ఈ సమయంలో స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీపై ఈ శిక్షణ ఉంటుందని గూగుల్‌ ఉత్పత్తుల అభివృద్ధి, భారతీయ శిక్షణ విభాగం అధిపతి విలియమ్‌ ఫ్లోరెన్స్‌ వెల్లడించారు. ఈ అవకాశం వినియోగించుకుంటే భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ప్రపంచ స్థాయిలో నాణ్యమైన, అధునాతన మెలకువలు కలిగిన నిష్ణాతులుగా మారతారు.

ప్లూరల్‌సైట్‌ ద్వారా మొదట తమ సాంకేతిక మెలకువల స్థాయిని అభ్యర్థులు బేరీజు వేసుకోవచ్చు. తదనుగుణంగా ఆండ్రాయిడ్‌ డెవలపర్‌, మొబైల్‌ ఇంటర్‌నెట్‌ స్కిల్స్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్చర్‌, డేటా ఇంజినీరింగ్‌ అనే నాలుగు ముఖ్యమైన రంగాల్లో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.

ఈ స్కాలర్‌షిప్‌ ఆధారిత శిక్షణ కార్యక్రమం ద్వారా గూగుల్‌, ప్లూరల్‌సైట్‌, ఉడాసిటీ సంస్థల్లోని అనుభవజ్ఞులు, నిష్ణాతులతో అభ్యర్థులకు పరిచయం పెరుగుతుంది. వారి సహాయ సహకారాలు, శిక్షణ, పర్యవేక్షణలతో మరింత సాంకేతిక నైపుణ్యాన్ని సాధించి ఉద్యోగావకాశాలను మెరుగు పరచుకోవచ్చు. అంతేకాకుండా నేటి, రేపటి సమాజ అవసరాలకు ఉపయోగపడే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేయగలిగిన సామర్థ్యాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా ఇంటర్‌నెట్‌ వేదికగా ఈ-కామర్స్‌ సేవల రంగంలో కూడా ఉన్నత ఉద్యోగాలతో కెరియర్‌ని ప్రారంభించవచ్చు.

ఎందుకీ స్కాలర్‌షిప్‌లు?
చైనా తర్వాత స్మార్ట్‌ఫోన్‌లు అత్యధికంగా వినియోగంలో ఉన్న భారతదేశంలో ఇంటర్‌నెట్‌ అందరికీ అందుబాటులోకి తెచ్చి తమ సేవలను విస్తరించాలని గూగుల్‌ భావిస్తోంది. ప్రపంచంలోని వివిధ ఉత్పత్తులు భారతదేశ అవసరాలకు ఉపయోగపడే విధంగా చూడటం, భిన్న అభిరుచులు, సంస్కృతుల సమాహారమైన మన దేశానికి విలువైన, ఉపయుక్తమైన కంటెంట్‌, వీడియోలను అందించాలనుకుంటోంది. వివిధ స్థానిక భాషల్లో ఈ సేవలు అందించాలని గూగుల్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నిపుణుల అవసరం ఉంటుంది. అందులో భాగంగానే శిక్షణ ఇవ్వనుంది. తద్వారా ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి.

డిగ్రీలో చేరి ఉంటే చాలు!
అభ్యర్థికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌సైన్స్‌ లేదా ఇతర అనుబంధ రంగానికి సంబంధించి డిగ్రీస్థాయిలో ప్రవేశం పొంది ఉండాలి. గూగుల్‌ సంస్థ కంప్యూటర్‌సైన్స్‌ లేదా దాని అనుబంధ బ్రాంచిలో అభిరుచి ఉన్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇస్తోంది. ఈ రంగంలోని కొత్త కోర్సులను ఆన్‌లైన్‌లో నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే అభ్యర్థులు ఇప్పటికే విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొంది ఉండాలి.

దరఖాస్తు పద్ధతి
ఉడాసిటీ, ప్లూరల్‌సైట్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. ఈ కింది లింక్‌ల ద్వారా విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
https://in.udacity.com/ google-india-scholarships
https://app.pluralsight.com/id?

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com