81.5 కోట్ల మంది ఆకలి కేకలు


ప్రపంచ వ్యాప్తంగా అన్నార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) వెల్లడించింది. దశాబ్దకాలంగా తగ్గుతూ వస్తున్న ఈ సంఖ్య.. సిరియా, ఇరాక్‌ అంతర్యుద్ధాలు, తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికాల్లో వాతావరణ మార్పులు, కరువు కారణంగా 2016 ఊహకందని విధంగా పెరిగిందని ఐరాస తన స్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్‌డీజీ) నివేదికలో వెల్లడించింది. 2015లో 77.7 కోట్ల మంది అన్నార్థులుండగా.. 2016లో ఆ సంఖ్య 81.5 కోట్లకు చేరిందని వివరించింది. ప్రపంచ దేశాల్లో కరువు కారణంగా రూ. 20.35 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని పేర్కొంది. బాల్య వివాహాలను నిరోధించే విషయంలో భారత్‌లో చాలా వరకు పురోగతి ఉందని వెల్లడించింది. 2000-17 మధ్యకాలంలో 40ు మేర బాల్య వివాహాలు తగ్గాయని తెలిపింది. దక్షిణాసియాలోని పట్టణ ప్రాంతాల్లో నీటిమట్టాలు పడిపోతున్నాయని, ప్రతి 10 మందిలో 9 మంది కలుషిత జలాలనే తాగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. విద్యుత్తు, పారిశుద్ధ్య వ్యవస్థలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని వివరించింది. అన్ని దేశాలు 2030లోగా ఈ సమస్యలను పరిష్కరించాలని 2015లో నిర్ణయించాయని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటేనే ఆ లక్ష్యాన్ని చేరుకోగలమని ఐరాస అభిప్రాయపడింది.
నేడు ‘ప్రపంచ వితంతు దినం’
ప్రపంచ వ్యాప్తంగా 25.85 కోట్ల మంది వితంతువులు ఉన్నారని.. వీరిలో సింహభాగం అంతర్యుద్ధాల బారిన పడ్డ దేశాల్లోనే ఉంటున్నారని ఐరాస తెలిపింది. శనివారం ‘ప్రపంచ వితంతు దినం’ నిర్వహించనున్న నేపథ్యంలో.. అందుకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది. 2010-15 మధ్య కాలంలో ప్రపంచంలో వితంతువుల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిందని పేర్కొంది. పలు దేశాల్లో వితంతువులు కట్టు బానిసలుగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఐరాస నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు
ప్రపంచ వితంతువుల్లో 24 శాతం తూర్పు ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఉన్నారు. ప్రతి ఏడుగురిలో ఒక వితంతువు (3.8 కోట్ల మంది) కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు.
ప్రతి పది మందిలో ఒక వితంతువు పెళ్లీడు వయసులో ఉన్నారు. అఫ్ఘానిస్థాన్‌, ఉక్రెయిన్లలో ఈ నిష్పత్తి 1:5గా ఉంది. మూడింట ఒకటోవంతు వితంతువులు భారత్‌, చైనాల్లో ఉండగా... వీరి సంఖ్య భారత్‌లో 4.6 కోట్లు, చైనాలో 4.46 కోట్లుగా ఉంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com